Category Archives: ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ

నదులంటే కొన్ని స్నానఘట్టలా??? (5)

  పోయిన నెల మాంఛి హాస్య కథ చెప్పి మీ పొట్టలు చెక్కలు చేశాను కదూ?!. నేను ముందే హెచ్చరించాను. పొట్ట చెక్కలను కలిపి కుట్టుకునే పరికరాలు మీ దగ్గర రెడీగా వుంచుకోవాలని. హెచ్చరిక విని జాగర్త పడిన వారు జీవించి వుంటారు. పడని వారు?  వాళ్లు కూడా వుంటార్లెండి! మరలాగయితే, ‘ఉండడమా వుండకపోవడమా…’  అని … Continue reading

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

ఉండటమా వుండకపోవడమా? అదీ ప్రశ్న!(4)

  ఒక హాస్య కథ రాద్దామనుకుంటున్నా. మామూలు హాస్యం కాదు. కథ అయిపోయే సరికి నేల పాలయిన చెక్కలన్నీ ఏరుకుని, మీ పొట్టను మీరు మళ్లీ కుట్టుకోవాల్సి రావొచ్చు. అసలు నవ్వొద్దని నొసలు ముడుచుకుని చదవడం మీ పొట్టలకు మంచిది. నాకు మంచి కథ రాయడం రాదని ఎడిటర్ రంగా చెప్పారు. ఆ సంగతి నాక్కూడా … Continue reading

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

ప్రమాదకర అబద్ధం (3)

  నిజమైన క్యూరియాసిటీతోనే అడుగుతున్నా. గుచ్చి ఎవరినో నొప్పిద్దామని కాదు. శిలువ మీద గుచ్చి ఎత్తబడిన మనిషి నొప్పి ఇది. ఈ నొప్పిని కాస్త తగ్గించుకుందామని కూడా అడుగుతున్నా. ఆకాశం బ్యాగ్రౌండ్ కలిగిన ఒక శిలువ మీద అంతెత్తు మీంచి అడుగుతున్నాను గాని, ఇదెవరినీ లుక్ డౌన్ చేయడం కాదు. క్రీ చూపు చూడడం కాదు. … Continue reading

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

జేమ్స్ బాండు మనోడేనోచ్(2)

‘ఓ మహాత్మా ఓ మహర్షీ!’ పేరుతో చినుకు మాస పత్రికలో  రాస్తున్న కాలమ్ లలో ఇది రెంఢోది. 2016 జులై నెలలో వెలువ‍ఢింది. (జూన‍ స‍ంచిక‍లో కాల‍మ్‍ రాలేదు).. విన్నారా, పురాణ కథల్ని మార్చి రాయడం తప్పట. పెద్దవాళ్లు అలా చేశారు గాని, ఇప్పటోళ్లం చేయగూడద‍ట‍. పెద్దోళ్ళు ధ్యానించి రాశారు. మనం వూహించి రాస్తామ‍ట. వాళ్లు … Continue reading

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

ఓ మహాత్మా ఓ మహర్షీ (1)

‘ఓ మహాత్మా ఓ మహర్షీ’ పేరుతో ‘చినుకు’మాస పత్రికలో 2016 జూన్ నెలతో మొదలెట్టి ఒక కాలమ్ రాస్తున్నాను. అంచులో ఇది మొదటిది: ఏది నెగటివ్ ఏది పాజిటివ్? ‘నిన్ను నీవుగా ప్రేమించుటకై నీ కొరకు కన్నీరు నించుటకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము’ ఊరికే అనుకోవడమే గాని, ఇది ప్రేమ గీతం కాదు. … Continue reading

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment