రాయల సీమకు ఈ సంస్థ అవసరం

అప్పుడు తెలంగాణ సంగతేమో గాని, ఇవాళ రాయల సీమకు  ఈ విద్యావంతుల వంటి ఒక సంస్థ అవసరం చాల వుంది. నేడు రాయల సీమ ప్రజ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సీమలో పుట్టి పెరిగిన నేతల ద్రోహం నుంచి వుపశమనం కోరుకుంటున్నది. జనంలో జవ జీవాలు లేక కాదు. జనంలో చైతన్యం లేక కాదు. జనంలో చైతన్యం లేదని ఒక తప్పుడు మాట ప్రచారంలో వుంది. సీమలో పాలక వర్గ నాయకులుగా ముందుకొచ్చిన కొందరి మీద చిరకాలంగా గూడు కట్టి వున్న అపనమ్మకమే నేటి సంక్షోభానికి కారణం. ఏ కాస్త కదిలిక కనిపించినా ఫట్ మని ముందుకొచ్చి జన చేతనను తమ రాజకీయావసరాలకు కుదించే పాత ‘నిరుద్యోగ’ నేతల స్వార్థం దీనికి కారణం. నిజంగా సీమ బాగు కోరుతున్నట్లయితే, ఇప్పటికే ఫ్యాక్షనిస్టులుగా, హంతకులుగా పేరొందిన నాయకమ్మన్యులు… తమ వల్ల సీమకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసమైనా… తాము కేవలం సహాయకులుగా వుండి, అలాంటి కళంక చరిత్ర లేని పెద్దలను, యువకులను ముందు పీఠీన నడవనివ్వాలి. దానికి తగిన భూమిక ఏర్పడాలి. ఆ భూమికను ఏర్పరిచే పనిని… నేటి స్ఠితిలో జనాన్ని నడిపించే పనిని… ఇలాంటి ఒక సంస్థ మాత్రమే చేయగలుగుతుంది. ఇలాంటి ఒక సంస్థ మాత్రమే ఇప్పుడు రాయలసీమ ప్రజలకు కాస్త నమ్మదగిన నాయకత్వం అందించగలుగుతుంది.

సీమలో నేటి సామాజిక దశకు తగిన నాయకత్వం ఎవాల్వ్ కావాలంటే, వీలయినంత ఎక్కువగా ప్రజా శ్రేణులు కలిసి వచ్చే చర్చ, చర్య జమిలిగా సాగాలి. జులై 17 అజెండాలో ఆ రెండింటికి తగిన అంశాలున్నాయి. ఈ నిర్ణయాలు ఏమాత్రం అమలు జరిగినా జులై 17వ తేదీ చరిత్రాత్మకం అవుతుంది. ఈ నిర్ణయాలన్నీ అమలు జరగడానికి వీలున్నవే. ఇందులో పెద్దగా వర్గపోరాటాంశాలు, సోషలిస్టు డిమాండ్లు లేవు. అవి లేక పోవడం సరైనది. ఇందులోని డిమాండ్లన్నీ బూర్జువా ప్రజాతంత్రయుతమైనవి. నాకు అర్థమయినంత వరకు నాయకత్వం మాత్రం శ్రామిక చేతనకు సంబంధినది. ఇది పని చేస్తుంది. ఈ అజెండా లోని అంశాలలో దేన్నీ ఏ బుద్ధిజీవుల గ్రూపూ తిరస్కరించ లేదు. మిగిలిన ఏ విభేదాన్నయినా, ఈ సంస్ఠకు బయట స్వేచ్చగా చర్చించుకునే అవకాశం వుంచుకుని, రాసీమ హక్కుల కోసం నిలబడ దలచిన ప్రతి ఒక్కరూ ఇందులో చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక తెలుగువాడిగా, రాసీమ బిడ్డగా నన్ను మీలో ఒకడుగా భావించాలని సంస్థలోని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఊళ్లో లేను. ఇప్పుడిప్పుడే ఆ అవకాశం లేదు. ఉన్న చోటు నుంచి నేనేమి చేయగలనని నాకు నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో స్నేహితుల సలహాలు కోరుకుంటాను.

జై రాయల సీమ
జై ప్రజాతంత్ర రాయలసీమ

Arun Virasam

17జూలై ఆదివారం అనంతపురం లో విద్యావంతుల వేదిక రాస్త్రకమిటి సమావేశం జరిగింది. ఈ కింది నిర్ణయాలు చేయబడ్డాయి. రాయలసీమ చరిత్ర,సంస్కృతి,బాషా,సాహిత్యాలపై విడివిడిగా తరగతులు నిర్వహించాలని, రాయలసీమ తాగు,సాగు నీటి అవసరాలపై, నీటి వనరులు, జలహక్కులపై సీమ నాలుగు జిల్లాల జలనిపుణుల తో సెప్టెంబర్ 17,18 న అనంతపురం లో తరగతులు నిర్వహించాలని, అంతే గాక సీమ చారిత్రిక వ్యక్తుల జయంతి వర్దంతులను జరపాలని తీర్మానం చేయబడింది.
1) వలసవాద వ్యతిరేక పోరాట దినంగా తెర్నేకళ్ అమరుల,గులాం రసూల్ ఖాన్ సంస్మరనోత్సవం,
2)సాంస్కృతిక దినంగా వేమన జయంతి.జనవరి19
3)నమ్మకద్రోహ దినం-శ్రీబాగ్ వొప్పందం,నవంబర్16
4)రాయలసీమగా నామకరణ దినం- నవంబర్ 24
.5)రాయలసీమ రాస్ట్రవుద్యమ దినం-పప్పూర్ రామాచార్యుల జయంతి/వర్దంతి.
6)సాహిత్య దినం- విద్వాన్ విశ్వం జయంతి/వర్దంతి
7)నాగార్జున సాగర్ శంకుస్థాపన రోజు-జల విద్రోహ దినం.ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచెర్ల జయంతి/వర్దంతులు జరపబడుతున్నాయి.
అంతేగాక రాయసీమలోని చారిత్రిక వ్యక్తుల జీవితాలను,శ్రీబాగ్ వొప్పంద పత్రాన్ని,దాని నేపథ్యం- పాట్యాంశలలో చేర్చాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూంది. అందుకై ఆందోళన కార్యక్రమం యితర ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయించబడుతుంది.
సీమ వివిధ జిల్లాలో మరుగునబడ్డ పోరాటవీరుల పేర్లను సంఘటనలను వేదిక దృష్టికి తేవాలని సీమ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.పై విషయాలలో సలహాలు,సూచనలను సవినయంగా స్వీకరిస్తాం. అరుణ్ ,కన్వీనర్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s