నిన్నటి పోస్టు మీద చర్చ కొనసాగింపు

ఇది నా నిన్నటి పోస్టు మీద చర్చకు కొనసాగింపు. పద్మప్రియకు నేను రాసిన జవాబు చాల మందిని రాంగ్ సైడ్ రబ్ చేసినట్టుంది. నేనేం చేయలేను. విసుక్కున్న విక్రమార్కులు రాసిన కామెంట్లు జవాబు ఇవ్వాల్సిన వ్యాఖ్యలే. వాటికి రాసిన వుమ్మడి జవాబును పోస్ట్ చేయబోతే, ఫేస్ బుక్ తీసుకోలేదెందుకో. అందుకని దీన్ని వేరుగా మరో పోస్టుగా ఇలా:

Aranya Krishna!
నా పోస్టులో వున్న శాపనార్థాలు ఏమిటి? పైన మీరు (రంగనాయకమ్మమీద) ఏవేవో అభిప్రాయాలు చెబితే, వాటి మీద నేనేమీ వ్యాఖ్యానించ లేదు. మరి, ఈ శాపనార్థాల వంటి రెచ్చగొట్టే మాటలెందుకు మిత్రమా! Padma Priya Karumanchi కు జవాబుగా రాసిన నా కామెంటుతో మీకేం సంబంధం? మీరు రాజకీయ అవకాశవాది అని నేను అన లేదు. మీ రాజకీయమేమిటో… పైపైన తెలుసు గాని, అంత వివరంగా నాకు తెలీదు, తెలీనివి మాట్లాడే అలవాటు నాకు లేదు. రాజకీయ అవకాశ వాదం అనే మాట నేను అన్నదెవరినో వాళ్ళను జవాబు చెప్పుకోనివ్వక మధ్యలో మీరేమిటిలా? ఒక వైపు తిరిగి ప్రభుత్వ నేతలతో కరచాలనం, మరో వైపు తిరిగి యువకుల్ని చావు బతుకుల పోరాటాల్లోకి పంపించే బాధ్యత లేని వీరత్వం… ఇది తప్పని చెప్పినందుకు, రంగనాయకమ్మ మీద ఎవరో ఎన్ జీ వో నేత్రి ప్రేలిన ప్రేలాపనల్ని కవిత్వమని షేర్ చేసి మురిసి పోవడం… అది పచ్చి అవకాశవాదమని నేను అనుకుంటున్నాను. ఆ అవకాశవాదానికి వత్తాసుగా ముందుకొచ్చి, రంగనాయకమ్మ మీద తనకు లేని పాండిత్యం ప్రదర్శించిన వారిలో … ఈ పోస్టులో నేను తప్పు పట్టిన నా మిత్రుడు వున్నాడు కాబట్టే, ఆ మాట ఇక్కడ వచ్చింది. ఇలా ఎవరో జవాబు చెప్పాల్సిన ప్రశ్నలుండగా, వాళ్ళను జవాబు చెప్పొద్దని, వూరుకోమని చెప్పే పెద్దమనిషిత్వం మీదేసుకుని, మళ్లీ మీరే ముందు కొచ్చి, వాళ్ళ తరుఫున మీరు జవాబు చెప్పడం తప్పు సోదరా! రంగనాయకమ్మతో మీకూ విభేదం వుండొచ్చు. ఆ సంగతి దానికి తగిన స్టలంలో చర్చించండి. ఇలా మీరు కూడా వ్యతిరేకించే దాన్ని ఆమె వ్యతిరేకించే చోట ముందుకొచ్చి… మీరు ఏ ఇస్యూని వుతిరేకిస్తున్నారో మీకే తెలీని గందరగోళంతో పడి అందర్నీ ఇబ్బంది పెట్టడం వద్దు.

Bhargava Gadiyaram
ఎల్ జీ బీ టీ విషయంలో రంగనాయకమ్మ చేసిన తప్పు ఏమిటో కొటేషన్ తో సహా రాయి. ఇలా ఎందుకడుగుతున్నానంటే, కొటేషన్ కోసం ఆమె అభిప్రాయాల్ని నువ్వు మరోసారి చదువుతావు. అందులో నువ్వనుకున్నంత గోరం లేదని గ్రహిస్తావు? కులం విషయంలో నీకు (నాకు కూడా) ఆమెతో విభేదం వుండొచ్చు. అంత మాత్రాన ఆమె అభిప్రాయాల్ని చెత్త అనడం ఏమి చర్చా పద్దతి? ఏం? కులం గురించి నీ దగ్గర అంతిమ పరిష్కారం వుందా? ఇప్పటికీ అందులో చర్చనీయాంశాలున్నాయని నువ్వు అనుకోడం లేదా? ఇస్యూ ను ఇస్యూగా చర్చిస్తే చర్చించు. నేను చూసిన మేరకు, రంగనాయకమ్మ పాల్గొన్న అలాంటి చర్చల్లో ఎక్కడా నువ్వు లేవు. ఉన్నట్టుంది ఈ స్వీపింగ్ కామెంటులో మాత్రం వుంటానంటే ఎలా భార్గవా?

Vruddhula Kalyana Rama Rao
ఇక్కడ మతం చర్చ లేదు కాబట్టి మీరు ముందుకు తెచ్చిన అంశాల మీద నేను వివరంగా రాయడం లేదు. కొకు దయ్యాలను తన యవ్వనకాలం నుంచి నమ్మాడా లేడా అనేది చర్చనీయాంశం. ఆయన ఏదో చివరి రోజుల్లో నమ్మాడు అని మిత్రుడు బుకాయించాడు రాత్రి. అది అబద్ధమని నా పోస్టు. అబద్ధాన్ని అబద్ధమనడం నాకు చాల ఇష్టం. తాను మాట్లాడింది అబద్ధమని నా మిత్రుడికి బాగా తెలుసునని, అయినా మాట్లాడే అడాసిటీ ఎందువల్లనో అతడికి కలిగిందని నేను గట్టిగా అనుకుంటున్నాను. అది తనకు మంచి కాదు. తను ఒక వ్రాయసగాడు, నోరున్న వాడు కూడా కాబట్టి అది లోకానికి మంచిది కాదు. అందుకే నేనా పోస్టు రాశాను.
మీరు దయ్యాల్ని నమ్ముతారా లేక నమ్మకుండానే భయపడతారా, మీరు మార్క్సిస్టు అవునా కాదా అనేది ఏదీ ఇక్కడ చర్చనీయాంశం కాదు. మీరు ‘భయపడతారు అదే సమయంలో మార్కిస్టు’ కాబట్టి మార్క్సిస్టులు దయ్యాలంటే భయపడడం సహజమని మీరు డెడ్యూస్ చేస్త లేరు కదా? చర్చలో లేని అంశాలని ముందుకు తెచ్చి గందరగోళం చేయడం చలవాదమో మరేదో తర్క దోషమవుతుందని మీ బోటి పెద్ద వారికి చెప్పక్కర్లేదు.

Suvarna Kumar
‘అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడంలో వివేకం ఉంది, ఖండఖండాలుగా ఖండించడంలో లేదు అని సువర్ణ కుమార్. ఆ అవగాహన నాకుంది. ఇంతకూ ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతున్నదో మీరు వివేచించారా సువర్ణా! దయ్యాలున్నాయా లేవా అనేది కాదు ఇక్కడి చర్చ లోని అంతర్లీన వ్యవహారం. ఒక మంచి రచయితని విప్లవద్రోహి అంటూ ఒకాయన అనేశాక, అదెలాగో చెప్పమంటే అప్పటికప్పుడు నోటికొచ్చింది చెప్పి, దానికి సోర్సు వుందని చెప్పాడు. పొద్దున లేచాక ఫేస్ బుక్ లో ఆ సోర్స్ ని కోట్ చేయమని నేను ఆడిగాను. అదేం ఆక్కర్లేదని ఇందరు పెద్దమనుషులు నాకు ప్రైవేటు చెప్పడంలో ఆంతర్యమేమిటంటారూ? ఆమెది కాదు, ఆమె విమర్శించిన ‘విరసం’దే ఎక్కువ విప్లవద్రోహం అని నేనంటే దానికి ఉపపత్తి చూపించమన్న మనిషికి…. వీలయింత త్వరగా నేనది చూపించాలా వద్దా? వీళ్ళదంతా విప్లవం మాటల వెనుక దాగిన స్టేటస్కోయిజం యొక్క కొత్త క్యాంపెయిన్ అని నేను భావిస్తున్నాను. అలా అనుకుంటున్నాను కాబట్టే, ఆ హిపోక్రసీని బయటికి చెప్పి, నా మిత్రులలోంచి దాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నాను. అదీ ఈ చర్చలోని అంతర్లీన విషయం. హిపోక్రసీ ని వదిలించుకునే ప్రయత్నం చాల ముఖ్యమని అది జరక్కుండా ఏం జరిగినా వేస్టే అని నేను చిరకాలంగా భావిస్తున్నాను. ఇది అవసరం లేదని మీకు అనిపిస్తోందా? మరిక, ఏది అవసరం?

చివరగా ఒక వివరణ: నేను రంగనాయకమ్మ అభిమానిని. వివి అభిమానినీ, శ్రీశ్రీ అభిమానినీ కూడా. నేను రంగనాయకమ్మ అనుచరుడిని కాదు. ఉదాహరణకు చలం విషయమై ఇటీవల నేను రాసిన అభిప్రాయాలు రంగనాయకమ్మ అభిప్రాయాలకు భిన్నమైనవీ, విరుద్దమైనవీ. చలం మీద ప్రచురించిన రంగనాయకమ్మ వ్యాసాల పుస్తకాన్ని చదివి వున్న నాకు ఆ విషయం తెలుసు. సత్యంతో ప్రమేయం లేని విధేయతలు నాకు లేవు. ఉండి వుంటే చలం మీద ఆ వ్రాతలు నేను రాయకూడదు. కులం విషయంలోనూ రంగనాయకమ్మ, నేను వేర్వేరు మార్గాలలో ఆలోచిస్తున్నామని మా ఇద్దరి ఇటీవలి వ్యాసాలు… ఒకసారి… ఒకే పత్రిక, ఒకే పేజీలో వచ్చిన వ్యాసాల్నయినా… చదివితే మీక్కూడా తెలుస్తుంది. ఆ వ్యాసాల సందర్భంగా ఎవరో రంగనాయకమ్మ వ్యాసం గురించి ఆడిగితే నేను చెప్పాను కూడా. అవేం చదవక్కర్లేదు, మేం పెద్దమనుషులం, రచ్చబండ మీద కూర్చుని, మేము చదవని వాటి గురించి కూడా ఏమైనా మాట్లాడుతామనడం అన్యాయం.

10-06-2016

 Comments:
Suvarna Kumar: ఓ ప్రైవేటు సంభాషణను, అదేదో కొత్త విషయమన్నట్టు మీరు షేర్ చేసి చర్చపెట్టడమే తప్పు. సాక్ష్యాధారాలతో మీ మీ వాదనల్ని నిరూపించుకోవాలనుకుంటే ఆ పనిని మీరిద్దరూ లేదా ఆ పూట అక్కడున్న గ్రూపూ ప్రైవేటుగానే సెటిల్ చేసుకోవచ్చు. రచ్చకెక్కాక ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతారు. మీరు మళ్లీ ఆ అభిప్రాయాలకు సుదీర్ఘంగా సమాధానాలు చెప్పటం, ఆ చెప్పినవాళ్లలో నచ్చనివాళ్లకు చురకలంటించడం ఏం బాగోలేదు. మీరు పాత విషయాలు నెమరువేసుకునే కొత్త అలవాటులో భాగంగా ఇలా ఓవర్ రియాక్టవుతున్నరేమో ఆలోచించండి హెచ్చార్కే గారూ! ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్…మీకు తెలియని విషయమేం కాదు!!
My reply: మిత్రమా! ‘ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్..’ అంటే మాట్లాడకపోవడం కాదు. సత్యానికి మించి మాట్లాడకపోవడం. అసలు మాట్లాడకపోవడమే అయితే చలం మ.ప్ర. కి అంత పొడుగు ముందుమాట రాయగూడదు. ప్రైవేటు సంభాషణల్లోని విషయాల్ని బహిరంగం చేయగూడదనే మర్యాద నాకు ఇష్టమే. పాటిస్తాను కూడా. దానికి ఒక హద్దు వుంది. మా సంభాషణ సమయంలోనే… రంగనాయకమ్మ మీద తన తీవ్ర వాక్కులకు సోర్సు చూపించమని చాల ఇండిగ్నేషన్ తో నేను… కొకు మీద నా మాటలకు సోర్సు చూపించాలని అంత గట్టిగానే తనూ అడగడం…. జరిగిందని నా మొదటి పోస్టు మొదట్లోనే చెప్పాను. తెల్లారాక నా పని నేను చేశాను. ఇది తఫ్పు కాదు. అమర్యాద కాదు. నేను ఎవరి ప్రైవేటు బతుకుల జోలికీ పోలేదు. (పోవడం తప్పని కాదు, ఎప్పటికీ పోనని కాదు ఇప్పుడు పోలేదు). తన పని తాను చేయలేదు. అది తప్పు అని చెప్పకపోగా, నాకు మర్యాద వచనాలు వల్లిస్తున్న వారిదీ తప్పే.
Suvarna Kumar: 

హెచ్చార్కే గారూ మీరు మాంచి ఫాంలో ఉన్నారు. మీ దూకుడు మీదే కానీ, రెండో వైపు తొంగిచూసేలా లేరు. “సత్యంతో ప్రమేయం లేని విధేయతలు నాకు లేవు. ఉండి వుంటే చలం మీద ఆ వ్రాతలు రాయకూడదు” అన్నారు. చలంపై మీరు రాసిన రాతల పట్ల నాకూ అభ్యంతరం లేదు. బ్రాహ్మణీకం నవలలో మీరు మెన్షన్ చేయని బ్రాహ్మణీకం ఇంకా చాలా ఉంది. చాలా చక్కగా ఎనలైజ్ చేశారు. మిమ్మల్ని తప్పుపడుతూ బాపూజీ రాసింది చప్పగా ఉంది. దానికి మీరిచ్చిన కౌంటర్ ఇంకా గొప్పగా ఉంది. అయినా కూడా అసందర్భంగా చలాన్ని బజారుకీడ్చారనే అంటాను. మీ మీద , మీ విమర్శ మీద ఎంత గౌరవం ఉన్నా…అసందర్భాన్ని అసందర్భమనడం నాకు ఇష్టం. ఆ వ్యాసాల మీద జరిగిన చర్చలో కొందరు “ఓహో చలంలో ఈ కోణం కూడా ఉందా…” అన్నారు గమనించారా! ఇవాళ మనం చలానికి ఇవ్వాల్సిన ప్రచారం ఇదా!? అది కూడా అసందర్భంగా!!!

 My reply: సువర్ణ, చాల థాంక్స్. మీరు ఎందుకు కోప్పడుతున్నారో ఇంతకు ముందు అర్థం కాలేదు. ఈ విషయం ఆలోచిస్తాను.
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s