గూడ అంజయ్య ఇక లేడు

గూడ అంజయ్య ఇక లేడు. ఎమర్జెన్సీ, బహుశా చివర్లో శ్యామ్, కిట్టు, ప్రదీప్ మొదలైన పిడిఎస్యూ నాయకుల గ్రూపులో ఒకడుగా తను ముషీరాబాద్ డిస్త్రిక్ట్ జైలుకు వచ్చాడు. అంతకు ముందు కోదాడ్ జనరల్ కౌన్సిల్ కు తను వచ్చాడో లేడో కాని ‘ఊరి మనదిరా ఈ వాడ మనదిరా’ పాట ఆ సభల్లో మారు మోగింది. జైలు తరువాత కలిసింది మాసాబ్ ట్యాంక్ దగ్గరి పాలిటేక్నిక్ కాలేజీ హాస్టల్ లో తన గదిలోనే. అంజయ్య వాళ్ళ అన్న డాక్టర్ చంద్రయ్య తన కంటె ముందు నుంచీ పి డి ఎస్ యూ కార్యకర్త. చంద్రయ్య కూడా జైలు రుచి చూశాడు. అంజయ్యను ఆయన మాతృ సంస్ఠ అయిన ‘అరుణోదయ’ వుపయోగించుకోవలసినంత బాగా వుపయోగించుకోలేదేమో. ఇది విమర్శ కాదు. నాకు అన్ని విషయాలు తెలియవు. ఇదొక హంచ్ మాత్రమే. ఉద్యమంలో దళిత ఆకాంక్షలకు తగినంత ప్రాతినిద్యం లేదనే బాధ మాత్రం తనకు వుండేది. అలాగని ఉద్యమ అవసరాలకు కవిగా, గాయకుడుగా ముందుకు రాకపోవడం ఏమీ లేదు. అంజయ్య రాయడమే కాదు, చాల చక్కగా పాడుతాడు. కారణాలేమైనా ఎక్కువగా వేదికల మీద కనిపించక పోవడం వల్ల తను రాసిన ‘ఊరు మనదిరా’ పాటను గద్దర్ కొద్దిగా తన ‘భాష;కు మార్చి పాడడం వల్ల అది గద్దర్ పాటగానే ప్రసిద్దమయ్యింది. దాన్ని ఉషా కిరణ్ మూవీస్ ‘ప్రతిఘటన’లో వుపయోగించారో లెదో గుర్తు లేదు గాని, వుపయోగించాలనే చర్చ జరిగింది. రామోజీ రావు, రఘు కిదాంబీ తదితరులు వుండగా ఈ చర్చలో కల్పించుకుని అది గూడ అంజయ్య పాట అని నేను చెప్పాను. నా మరో మంచి స్మృతి… సిరిసిల్లా జగిత్యాల పోరాటాలు పెల్లుబికినప్పుడు దానిపై నర్సాగౌడ్, నేను మరి కొందరం పని గట్టుకుని పాటలు రాశాం. ఆ ఇస్యూ మీద నర్సన్న రాసిన ‘కోల్ కోల్ కోల్’ పాటను విపరీతంగా ఇష్టపడి మమ్మితల్లి నర్సన్నను ఇప్పటికీ ‘కోల్ కోల్ మామ’ అనే పిలుస్తుంది. నేను రాసిన ‘జాజర జాజర’ పాటను మిత్రుడు మల్లేపల్లి లక్ష్మయ్య పాడి బాగా పాపులర్ చేశారు. ఆ విడతలో నేను వెల్లి అంజయ్యతో ఒక పాట రాయించి మరీ విమోనలో అచ్చేశాను. ‘ఇక కలెవడదామురో ఎములడ రాజన్న ఇక ఎగవడదామురో ఎములడ రాజన్న ఇగ నిలవడదామురో’ అంటో అంజయ్య రాసి పాడిన పాట సిరిసిల్లా పోరాటంలో ఎన్ని గమకలున్నాయో అన్ని గమకాలు పలికించింది. ఎందువల్ల అయితేనేం ఒక అద్భుత వాగ్గేయకారుడు పొందాల్సినంత గుర్తింపు పొందకుండానే ఈ లోకానికి సెలవన్నాడు. అంజయ్య లేకపోయినా అతడి పాట నిజంగానే వుంటుంది గాని, బంగారు పళ్ళెం కూడా గోడ చేర్పు లేకుండా నిలబడలేదు. బీసిలు, ఎస్సీలు అని వేదికల మీద చెప్పే నాయకుకులు, ఇతర్లు అతడి పాటను ఉద్దీపింప జేయడానికి ఏం చేయ వచ్చునో.. గ్రూపు అవసరాలు/ ఆలోచనలు పక్కన పెట్టి ప్లాన్ చేయాలని నా మనఃపూర్వక విజ్ఞప్తి.

Hecchar Ke's photo.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s