డుమ్మాలంటే మనకు ఎందుకంత ఇష్టం? అనబడు ఒక క్వికీ

స్మృతి 15

ఆంధ్ర లొయోలా కాలేజీలో వుండగా పొద్దున్నే వానొస్తే భలే సంతోషం. వచ్చిన వాన పది గంటల లోపున్నే ఆగిపోతే భలే కోపం. సరిగ్గా పది గంటలకు అనగా క్లాసులు మొదలవడానికి కాస్త ముందు మొదలెట్టి మాంఛి వానొస్తే, అది పది తరువాత కాసేపుండి ఆగిపోతే… ఆ రోజు రెయిన్ హాలిడే. అలా కాకుండా ఇంకెలాగూ క్లాసులు మానేయడం కుదరదు. ‘ఫాదర్లు’ వివరణ అడుగుతారు. దేర్ఫోర్ ‘డుమ్మా’ కొట్టాలని ఎంత కోరిగ్గా వున్నా కుదిరేదు కాదు. ఎమ్మేలో మాత్రం అప్పుడప్పుడు ఆ ఆనందం అనుభవించేది. డుమ్మా కొట్టే ఆనందం.
డుమ్మా అంటే ఏంటి అంటారా! అది అప్పటి ప్యార్లాన్స్ మరి. మా అమ్మాయి వాళ్లు బంకింగ్ అనే మాట వాడగా విన్నాను. ఇప్పుడు మళ్లీ మాట మారిపోయి వుంటుంది. మాటలే మారేది. అప్పుడూ ఇప్పుడూ కోరికలు అవే.
అబ్బే ఈ రోజు వాన ఏమీ లేదు. అయినా ఈ రోజు డుమ్మా అనగా బంకింగ్ అనగా… ప్లెయిన్ తెలుగులో క్లాసు ఎగ్గొట్టడానికి…. వాన, ఎండ, చలి…. ఏదీ కారణం కాదు. నిన్న పగలు ఏవేవో పేచీల్లో పాల్గొన్నట్టున్నాను. అదీ బాగా తెలిసిన వారితో. నాకు బాగా ఇష్టమైన వారితో. ఒక పేచీలో నేనే ప్రవేశించాను. తగుదునమ్మా అని పనిగట్టుకుని. ఇంకో దానిలో మిత్రులు డైలాగు లోనికి పిలిస్తే వెళ్ళాను. ఆ పేచీలు ఏమిటి అని అడుగుతున్నారా? వదిలేద్దురూ, మీరూ మీ క్యూరియాసిటీనూ. అట్టా కాదు లెండి రెండో దాని గురించి చెప్పాలని నాకే కాస్త ఇచ్చింగ్ గా వుంది, చెబుతా … .
పగటి పేచీల హ్యాంగోవర్ వల్ల రాత్రంతా కలత నిద్ర. నిద్దర్లేచి కాస్త చెయ్యీ కాలూ కూడ దీసుకుని కూర్చోబోయానా… ఇప్పుడు ఉదయం 11.20. ఇక రాద్దామని, ఏ ఏడుగంటలకో పూర్తి చేసి అప్లోడ్ చేసేద్దామని…. అని… కలం నూరుకుంటూ కిందికి వెళ్లి నా మానాన నేను నా కాఫీ నేను కలుపుకుంటూ వున్నానా… మా అమ్మాయి “ఓహోయ్, హెచ్చార్కే! సాయంత్ర Camden, Walt Whitman House వద్దకు ఇబ్రిల్ అని మా ఫ్రెండ్ ఒకరు వస్తున్నాడు, వాళ్ల నాన్న కూడా వుంటాడు. అక్కడికి వెళ్లి కాసేపుండి, అక్కడి నుంచి వాళ్ళని ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్. మా నాన్న కూడా వస్తాడా”, అని అడిగింది నన్ను. ఇక చెప్పేదేముంది? మరో దేర్ఫోర్, తను బయల్దేరే లోగా ఈ కాలమ్ పని పూర్తి చేస్తానని అనిపించడం లేదు. అయినా ఏమంత తొందర? ఈ వారం ‘స్మృతి’ కాలమ్ కి డుమ్మా లేదా బంకింగ్ లేదా ప్లెయిన్ తెలుగులో…. ఏదో లెద్దూ…. అన్నమాట. అదీ చావు కబురు. మరీ చల్లగా వుందా?!
ఈలోగా ఒక మాట. 11 వ స్మృతి (‘ఛెలో ఆంధ్ర లొయోలా’)ని, కవిసంగమం పొయెట్రీ పేజీలో షేర్ చేశారు. దానికి జంపాల వి చౌదరి చేసిన కామెంటు నిన్న నన్ను కాసేపు ఎంగేజ్ చేసింది. అక్కడ నా కామెంటేదో నేను రాసేశాను గాని, అది ఇక్కడ అందరితో పంచుకోదగిన విశేషం అనిపించింది. నేను పరిచయం చేసిన లోయోలా గ్లూమీ వాతావరణం ఆయనకు కరెక్ట్ కాదనిపించింది. గోగినేని హాస్టల్లో, లొయోలా కాలేజీలో చౌదరి నా తరువాత ఏడాది పియుసీ చదివారు. ఫోటోగ్రఫీ క్లబ్, డ్రామా క్లబ్, డిబేటింగ్ క్లబ్ అంటూ ఏవేవో వుండేవట. అక్కడ (గోగినేని హాస్టల్/లొయోలా కాలేజీలో) చాల గొప్పగా వుండేదట. మా ఇద్దరి సంభాషణలో కొద్ది భాగాన్ని ఇక్కడ వుటంకిస్తాను. మీరు తప్పొప్పుల నిర్ణయం చేయాలని కాదు. ఈ సంభాషణ నాకు మాదిరిగానే మీలో ఏవో ఆలోచనలు రెకెత్తించవచ్చని…
జంపాల్ వి చౌదరి: I was in the last batch of PUC (1969-70) at Andhra Loyola College, Vijayawada, and lived in the Gogineni Hostel. I too was a book worm of modest means and from a Telugu medium ZP rural school. However, my experience at Loyola seems to be totally different than yours,Hecchar Ke. I had a whole lot of fun despite the strict rules of the hostel, and my inability to study during the study hours. I was in multiple after-hours activity clubs, dabbled in many activities like photography, acting etc., made the college quiz team, attended good guest lectures (including a debate on the then active Telangana movement – remember Goutu Laccganna and Moturi Hanumantarao speaking on that day) saw many movies in the hostel movie nights, and enjoyed browsing the well stocked hostel and College libraries, and even attended a 3 day leadership camp in Chirala. It was a heady time for a 14 year old, but it didn’t help much with what my elders expected – academic success frown emoticon But, I feel that the experience enriched me considerably and I recall those days fondly. I know that some of my friends from that time feel the same way too. I do not remember the bed coffee though. Our breakfast and coffee hour was at 7.30 as I recall. Yes, I too enjoyed the Moral Instruction classes (Father Mialil; he also led the Photography club).
నా జవాబు:Wow. V Chowdary Jampala You really had fun. And I really had hell. How come? I do not know. I never knew that there were such things as photography club, acting and debating clubs etc. I never knew of any such things there in those 4 years that I endured at Loyola. Not only me, I should have known if any of my friends participated in any of them. And I also wonder how you coped with having to talk with people and make any new friends there by talking in English. With this comment of yours, you really puzzle me. The lectures… almost none were enjoyable. I even used to sleep away the Telugu class of one Mr Purnachadra Rao. A classmate of mine, Sivaram (with a public school background) had to quarrel with the boring English lecturer, somebody named Gopayya. The lecturers mugged up and delivered it without stop. I enjoyed listening only when lecturers like SN Ramaswamy, Singh (Botany), Suresh and another (dept head) (English), Basavapunnaiah and another Rao (physics) came to our class as stopgaps when our own were on leave.
About books, I did read some as I mentioned in these columns and a few novels of Ranganayakamma. Only another book I remember was a good book on Short story writing by Orlin Tremaine, first time to know that that sort existed at all. It was the only book I read from Loyola library. all the others were borrowed from friends.
జంపాల్ వి చౌదరి: We must have gone to different Loyola Colleges, Hecchar Ke 🙂
నా జవాబు: V Chowdary Jampala, Actually I too felt the same. 🙂
అలాంటి క్లబ్బులూ అవీ వుండినట్టు పియుసీ ఒక్క ఏడాది మాత్రమే కాదు, మిగతా బిఎస్సీ మూడేండ్లలో కూడా నాకు తెలీదు. దానికి కారణం కేవలం నా బద్ధకమేనా? ఏమో, కావొచ్చు.
పియుసి లో వుండగా జ్వాల పత్రికలో, బిఎస్సీలో వుండగా మంత్లీ జ్యోతి పత్రికలో నా వచన పద్యాలు అచ్చయ్యేంత మెలకువగానే వున్నాన్నేను. ఒక సారి నోటీసు బోర్డులో నాటక రచనలు కావాలని ప్రకటన చూశాను. నేను ఒక నాటకం రాసి, అ ఫలానా ఫాదర్ కు ఇచ్చి వచ్చాను, ఫాదర్ల క్వార్టర్లుకు వెళ్లి. నెల రోజుల తరువాత ఆయన అదే క్వార్టర్లకు పిలిపించి నా మొదటాఖరి నాటక రచన కాగితాలు వెనక్కి ఇచ్చారు. ఆ అప్రదర్శిత నాటకంలో ఒక సెక్సు కథల రచయిత కూతురు రేప్ కు గురవుతుంది. కేసు. ఆ రచయిత సెక్సు కథల పాఠకులలో ఒకడు వాటితో ఇస్న్పైరైపోయి, ఇలా మనమెందుకు చేయగూడదు, చేసి చూద్దాం అనుకుని, చేసి చూస్తాడు. వాడికి తెలీకుండానే ఆమె రచయిత గారి కూతురైవుంటుంది. ఈ సంగతే వాడు కోర్టులో చెబుతాడు… అదీ నాటకంలో కథ. రచన బాగుంది గాని, ఇందులో రేప్ సంగతి వుంది గనుక, నాటకంలో చూపడం/చెప్పడం కుదరదు… అని వెనక్కి ఇచ్చేశాడు ఫాదర్. నేను అంతకు ముందు ఒక ఫంక్షన్ లో చూసిన నాటకంలో ‘లంగా ఎత్తుకుని లగెత్తుకొచ్చేశాను’ వంటి డైలాగులు విని వుండడం వల్ల ‘సర్సర్లే ఫాదరూ’’ అని మనసులో అనుకుంటూ ఆయన ముందొక వెర్రి నవ్వు నవ్వి వచ్చాను.
ఇదెందుకు చెప్పానంటే, నేను మరీ అంతగా నిద్దరపోతూ లేను. నా మేరకు నేను యాక్టివ్ గానే వున్నాను. బిఎస్సీ మూడేండ్లూ అయిపోయాక ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. అప్పుడు నేనొక పెద్ద కవిత చదివాను. జువాలజీ లెక్చరర్ ఇఎస్ ఆర్ కె ప్రసాద్ నా దగ్గరికి వచ్చి ఆ పద్యానికి గాను నన్ను మెచ్చుకోడం ఒక్కటే ఆ నాలుగేండ్లలో నా తీపి గుర్తు.
‘మనం ఇద్దరం రెండు వేర్వేరు లొయోలా కాలేజీలకు వెళ్లినట్టున్నాం’ అని.. జంపాల్ వి చౌదరి నేను ఇద్దరమూ ముక్తకంఠంతో అనుకున్నాం. అనుకుంటున్నాం. మా ఇద్దరిలో ఎవరమైనా అబద్దం చెబుతున్నామా? నేను అబద్ధం చెప్పడం లేదు. అది నాకు తెలుసు. అయన కూడా అబద్దం చెప్పడం లేదు. ఆ మేరకు నమ్మకముంది. మరి? ఇక్కడేదో తిరకాసుంది. ఇన్ఫరెన్సు స్పష్టమే.
మేమిద్దరం రెండు వేర్వేరు లొయోలా కాలేజీలకు వెళ్ళాం. ఒకే లొయోలా లేదు. రెండో చాలానో లొయోలాలు వున్నాయి. ఉండినాయి. ఉంటాయి, ఇంకా చాల కాలం.
మనం అందరం ఒకే ప్రపంచంలో జీవిస్తున్నామని అమనుకుంటాం. లేము. కేవలం స్థలం, కాలం మాత్రమే మనల్ని విడదీస్తున్నాయని అనుకుంటాం. కాదు. స్థలం, కాలం వంటి యూనివర్సల్ అంశాలే కాకుండా, మరేవో పర్టిక్యులర్ అంశాలు కూడా మనల్ని విడదీస్తున్నాయి. మనందరం ఒకే ప్రపంచంలో జీవించడం లేదు. రెండు లేదా మరి చాల ప్రపంచాలలో జీవిస్తున్నాం.
నా ప్రపంచానికి నీ ప్రపంచం నిజమైన అడ్డంకిగా లేనంత వరకు మన మధ్య సహజీవనం వుంటుంది. అడ్డంకిగా వున్నంత మేరకు నీతో నాకు పేచీ (పోరాటం) వుంటుంది. పేచీ వున్నంత వరకు ‘ఓం శాంతి’ అని నేను ఎన్ని సుస్వరాలతో ‘మంత్రించి’నా నువ్వు నాతో కలవవు. అంత వరకు ఇన్ని వేర్వేరు ప్రపంచాలు సహజీవనం చేయాలి. ఆ సహజీవనానికి మినిమం గ్యారంటి కోసమే డైలాగు కొనసాగాలి. ఎప్పటికైనా ఈ ప్రపంచాల సంఖ్యను తగ్గించడానికి… అనగా… కాన్ఫ్లిక్టింగ్ ఏరియాల్ని తగ్గించుకుని శాంతి ఏరియాల్ని పెంచుకోడానికి… కూడా డైలాగు కొనసాగాలి.
ఇదొక ఆసక్తికర విశేషం. అలా ఎందుకు జరుగుతుంది. స్పెసిఫిక్ గా మా ఇద్దరి మధ్య ఎందుకు జరిగింది. కారణాలని ఊహించడం మరింత ఆసక్తికరం. నాకు తోచిన కారణాలు ఇవి:
1). అప్పటికే కెమెరాతో గాని, నటనతో గాని (స్కూల్లో గాని బయట గాని) పరిచయం లేని నా లాంటి వాళ్లం వాటి గురించి పట్టించుకుని వుండం. ఆ క్లబ్బులూ అవీ వున్నప్పటికీ అవి ఏదో ఎలీట్ యవ్వారమని మా లాంటి వాళ్లం దూరంగా వుండిపోతుంటాం. అలా దూరం వుండిపోకుండా మాలాంటి వాళ్ళని అస్సిమిలేట్ చేసుకునే యంత్రాంగం వాటిలో వుండాలి. నాకు గుర్తున్నంత వరకు, అప్పుడు నేను ఒక కెమెరాను ముట్టుకుని చూడడం కూడా కాస్త లగ్జురీయే. క్లబ్బుల బాధ్యుల దాకా వెళ్లి నాకూ నాటకం వేయాలని వుంది అని చెప్పే చొరవను ఆనాటి నాలో వూహించుకోలేను. సార్ల వైపు నుంచి ప్రొత్సాహం అందలేదని మాత్రమే చెప్పగలను.
2) ఎట్టాగో పళ్ళ బిగువున కాలేజీకి వెళ్ళే నా వంటి పిల్లలు అలా మరీ ఏ రెండు మూడొందల మైళ్ల దూరంలోని కాలేజీలకు వెళ్ళడం లోనే ఎలియనేషన్ మొదలవుతుంది. ఆ పరిస్టితి లేకుండా నైబర్హుడ్ లోనే మంచి కాలేజీలు వుండాలి. పిల్లల్ని వాటిలోనే చేర్పించాలి. లేదా అలా మరీ దూరం నుంచి వచ్చిన పిల్లలను ఆ ఎలియనేషన్ నుంచి కాపాడే యంత్రాంగాలు ఆలాంటి కాలేజీల్లో వుండాలి. ఎస్సెస్సెల్సి తరువాత నేను కర్నూలు వెళ్లి ఉస్మానియా కాలేజీలో చేరకపోవడం చాల పెద్ద తప్పుడు నిర్ణయం. దానికి బాధ్యత నాదేనంటారా? పోనీ, ప్రామిసరీ నోట్ చదువుకోగలిగే వరకు మాత్రమే చదువు వచ్చిన నా తలిదండ్రుల తప్పా?
ఇంతే, ఈ విషయమై ఇంతకు మించి నా దగ్గర ఎలాంటి ఐడియాలు లేవు. ఎప్పుడైనా ఐడియాలు తడితే మీతో పంచుకుంటాను. ఫై రెండింటిలో రెండవది (ఎక్కడికక్కడ కాలేజీలు అనేది) కాదు గాని; మొదటి సమస్య ఇప్పటికీ వుంటుందని అనుకుంటాను. సో కాల్డ్ లెస్సెఫేర్, నియోలిబరల్ వైఖరిని పిల్లల విషయంలోనైనా మానేయాలి. పిల్లలు అందరికీ సమాన అవకాశాలు వుండాలి. వూరికే వుండడం కాదు… ప్రిన్సిపిల్స్ రీత్యా వుండడం కాదు… అవి పిల్లలకు నిజంగా అందాలి. అందాలంటే… ఇంకా ఏం చేయవచ్చో అందరం ఆలోచించాలి.
(ఒక చిన్న సెలవు చీటీ రాద్దామనుకున్నా, దాదాపు రెగులర్ కాలమే అయ్యింది. 🙂వచ్చేవారం కలుద్దాం)
25-05-2016

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s