ఎప్పటికీ ఆరనిదీ కాగడా

చాల కాలం తరువాత నగరంలో జనాలు విప్లవాల గురించి మాట్లాడుతుంటే విన్నాను. అదీ ఒక మహా నగరం. న్యూ యార్క్. ఊరయితే నాకు మరీ కొత్తగా ఏమీ లేదు. హైదరాబాదులో చూసిన ట్రాఫిక్ జాములే, హార్న్ మోతలే, అతుకులు వేసిన తార్రోడ్లే… అన్నీ అవే కుంచెం కంచెం శాంపిల్స్ లాగ. బిల్డింగుల నిర్మాణంలో, చివరికి లేన్స్ ఏర్పాటులో మంచి ప్లానింగ్ కనిపించింది.

శుక్రవారం సాయంత్రం ప్లస్ శనాదివారాలు…. న్యూయార్క్ లోని జాన్ జే కాలేజ్ క్యాంపస్ లో పెద్ద మేళాగా సాగిన ‘లెఫ్ట్ ఫోరం 2016’ కాన్ఫరెన్సు కు తను వెళ్తూ నన్నూ తీసుకెళ్లింది మమత. ఇద్దరం ఐదారు సమావేశాల్లో పాల్గొన్నాం.

మనుషుల అవగాహన స్థాయులలో మునుపు హైదరాబాదులోచూసిందానికి ఇక్కడికీ విపరీత వ్యత్యాసం కనిపించింది. హైదరాబాదులో దాదాపు ప్రతి సభ, సమావేశం… స్నేహితుల్ని కలుసుకోడానికే వెళ్లేది నేను. సిగరెట్లతో గడిపేది. కాస్త పెద్దది అనిపించిన వరల్డ్ సోషలిస్టు ఫోరం అనుభవం కూడా అదే. న్యూయార్కులో… లెఫ్ట్ ఫోరంలో… వక్తల మాటలు, శ్రోతల స్పందనలు వినడం భలే బాగుండింది. మాట్లాడిన ప్రతి ఒక్కరూ చదువుకుని వచ్చి మాట్లాడారు. తాము చదువుకున్నదే. తమకు తెలిసిందే మాట్లాడారు. అన్నీ కాదు గాని విన్న మేరకు, గమనించిన మేరకు కొన్ని అంశాలపై ఇది నా నోట్ బుక్. ఇందులో నేను విన్నవీ, వాటికి నా స్పందనలు కలిసి వున్నాయి:

1). సంస్కరణకు విప్లవానికి మధ్య తేడా జనాలకు తెలుసు. సంస్కరణలోనే విప్లవానికి దోహదం చేసే అంశాలు వున్నట్టయితే అది మంచిదే. ఆ అంశాలు లేకుంటే… విద్య వైద్యాది విషయాల్లో మనకు మంచిగా కనిపించిన అంశాల్ని పాలకులు ఎప్పుడయినా వెనక్కి తీసుకోవచ్చు. న్యూ డీల్ సంస్కరణల నుంచి ఇప్పటి వరకు అదే పలుమార్లు జరిగింది. వీటిలో చొరవ, అదుపు (ఇనీషియేటివ్, కంట్రోల్) పూర్తిగా పెట్టుబడి దారీ పాలకుల చేతుల్లోనే వుంటాయి. పని చేసే వాళ్ల చేతుల్లో ఏమీ వుండవు. ఆ సంస్కరణల సమయంలో విప్లవానికి సంబంధించి మనం ఎందులోనైనా, ఏమైనా హెడ్ అవే సాధించి వుంటే అవి మాత్రమే మనకు (ప్రజలకు) మిగులుతాయి. రోజా లగ్జెంబర్గ్ వంటి వాళ్ళు సంస్కరణను వ్యతిరేకించింది, రిఫార్మ్ కాదు రెవల్యూషన్ కావాలి అని అన్నది ఈ అర్థంలోనే.

2). ఉద్యమాలు ఉద్యమాలుగా వున్నప్పుడే మంచి పాత్ర పోషిస్తునాయి. అవి అధికారాలు అయిన తరువాత కాదు. ఎప్పటికప్పుడు అప్పటికి వున్న మంచి శక్తులు అధికారంలోకి రావడానికి మనం సాయపడాల్సిందే. కాని, ఆ అధికారాన్ని కూడా వ్యతిరేకించాల్సి వుంటుంది. స్పాంటేనియస్ గా ముందుకొచ్చిన ఉద్యమాల్ని ఆర్గనైజ్ చేశాక అవి జన నిర్ణయాల్ని, జన క్షేమాన్ని వదిలేసి ఎటో పోతున్నాయి. అలాంటివి చాల సార్లు పాలకులు కోరుకునే మార్పుల్ని మాత్రమే తెచ్చి, ఆ తరువాత వూరుకుంటున్నాయి కూడా.

3). ఇండియాకు సంబంధించి… నీలి ఆకాశంలో అరుణ తార అనే వినాదం రెండు మూడు సార్లు.. మేము వెళ్లిన సెషన్స్ లో ప్రస్తావనకు వచ్చింది. నీలం ఎరుపు కలవాలంటున్నారు, కలిస్తే ఏమవుతుంది పర్పుల్ అవుతుంది అనే జోకు నుంచి అదొక్కటే ఇండియాకు మార్గం అనే దాక అభిప్రాయాలు వినిపించాయి. ఆ జోకు వేసిన వక్త సిపిఐ, సిపిఎం లను, ఎమ్మెల్ గుంపులను కూడా పక్కన పెట్టేశాడు. (సమావేశాల్లో నా అవధానత లెవెల్స్ బాగా తక్కువ. నేను తప్పుగా గ్రహించి వుండొచ్చు). రెండు భారత కమ్యూనిస్టు పార్టీలను సోషల్ డెమోక్రసీ హెడింగ్ కింద కేటగరైజ్ చెయ్యడం నాకు బాగుండింది. ఇంకా అర్థ వలస, అర్థ భూస్వామ్యం పదాల్ని వదలని ఎమ్మెల్ గుంపుల మీద అసంత్రుప్తి కూడా నాకు జెన్యున్ గానే అనిపించింది.

4). మేము ఒక కవిత్వం సెషన్ కు వెళ్ళాం. ఈ ఫోటోల్లో ఒక గ్రూపు ఫోటో వుంది చూడండి. అందులో వున్నవాళ్లే ఆ సెషన్ లో మొత్తం వక్తలు, శ్రోతలు అందరున్నూ. ఇంతకూ ఆ సెషన్ పేరు ‘సోషలీ కాన్షియస్ పోయెట్రీ’. ఈ పేరే నాకు చిత్రమనిపించింది. సామాజిక స్పృహ. తెలుగులో పలు మార్లు రిడిక్యూల్ కి గురైన మాట. న్యూయార్క్ లో యంగ్ ఆప్రికన్ అమెరికన్ కవుల్నించి విన్నాను. పోగా రాబర్ట్ గిబ్బన్స్ అనే యువ స్కాలర్ (తను న్యూ యార్క్ స్టేట్ యూనివర్సిటీలో పి హెచ్ డీ విద్యార్ఠి) ఆ మాటను చాల ఆవేశంగా పిడికిలి బిగించి పలుకుతుంటే, మన అభ్యుదయ కవుల్లో ఒకాయన పదే పదే గుర్తుకొచ్చారు. ఆ యువకులు కవిత్వాన్ని.. రచన నుంచి డెలివరీ వరకు ప్రతి దాన్నీ జాగర్తగా పట్టించుకుంటున్నారు. కవిత్వాన్ని జనం మధ్యకు తీసుకెళ్లడం ఎట్టా అని ఆలోచిస్తున్నారు. ట్రెయిన్ లో కవి సమ్మేళనాలు నిర్వహించడం వంటి ఆలోచనలు కూడావచ్చాయి సమావేశంలో.

మొత్తమ్మీద, నాకు నచ్చిన విషయాలు, సంతోషం ఇచ్చిన విషయాలు రెండు:

1. జీవితం మూడవ, నాల్గవ దశకాల్లో వున్న యువజనం తగినంత మంది లెఫ్ట్ ఫోరం లో కనిపించారు. ఊరికే కనిపించడం కాదు. వాళ్ళు బాగా చదువుతున్నారు. జరుగుతున్న వ్యవహారాల్ని జాగర్తగా గమనిస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు. గమనించిన వాటిని స్నేహితులతో నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. ఈ కాగడా ఎప్పటికీ మలగదు. పోగా తనను తాను సరి చేసుకుంటుంది.

2). ఇండియాలో వచ్చిన రైటిస్టు షిఫ్ట్ ఏ విధంగా ప్రమాదకరమో, ఎంత ప్రమాదకరమో యువకులకు, పెద్దవారికి అందరికీ బాగా అవగాహన వుంది. సో కాల్డ్ హిందూత్వ శక్తులకు… ఎక్కడి కక్కడ, ఎప్పటికప్పుడు… జవాబులు ఇవ్వడం చాల అవసరమని అందరూ గుర్తిస్తున్నారు. అమెరికాలో భారతీయ చీకటి శక్తులు ఎంత ఆర్గనైజ్డ్ గా, ఎంత విస్త్రుతంగా వున్నాయో యువ వక్తలు గ్రాఫిక్ గా జనం ముందుంచారు. మనం ఇంకా ఏం చేయగలం అని ఆలోచిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s