హైద్రాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం రగుల్తూనే వుంది. విద్యార్థులపై పెట్టిన కేసులు అలాగే వున్నాయి. రోహిత్ వేముల తదితర విద్యార్హులను బహిష్కరణ హింసలకు గురి చేసి, ఆత్మహత్యలకు ప్రేరేపించి… తప్పు చేశాడని చెబుతున్న అప్పారావు తిరిగి వీసీ పదవిలో కూర్చుని అప్పనంగా మేస్తూనే వున్నాడు. విద్యార్థుల్ని హింసించిన పోలీసోళ్ల మీద చర్యలుంటాయన్న కేసీయార్ అసెంబ్లీ ప్రసంగాంశాలు గాలిలో తేలుతూనే వున్నాయి. మరో మాటలో చెప్పాలంటే… ‘మీరేం చేసుకుంటార్రా’ అని ప్రభుత్వాలు ప్రజలకు సవాలు విసురుతున్నాయి. ‘ఇంకా ఏమీ చేయరేం, మీరేమైనా చేయాలి, మేము బలగాల్ని ప్రయోగించాలి, అశాంతి కలగాలి, అశాంత స్టితిలో మా కాంట్రాక్టు దందాలు మేము చేసుకోవాలి’ అని…. తమకు దొరికిన బిస్కెట్లు కొరుకుతున్న, కొరకడానికి కొత్త బిస్కెట్ల కోసం ఎదురు చూస్తున్న మేధావులతో కలిసి పండగ చేసుకుంటూ… లోకల్ పాలకులు ఎదురు చూస్తున్నారు
.
జనాన్ని రెచగొట్టడంలో భాగంగానే ఇప్పుడు కేంద్ర స్థాయిలో …

కన్నయ్య, ఖాలిద్, భట్టాచార్య తదితరులకు శిక్షలు వేశారు.

శిక్షలు సరే, వాళ్లు చేసిన తప్పేమిటి? ఇప్పుడిక శిక్షలు పడ్డాయి కదా, దీన్ని బట్టి వాళ్లు చేసించి తప్పేనని తెలుస్తోందని అంటారనుకుంటా. కాదంటే మీకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం లేదంటారు. విశ్వాసం ఎందుకుండాలంటే అలా అన్నందుకు ఇంకో కేసు పెడతారు.

ఓర్నాయినా, సహజ న్యాయమని ఒకటుంది. లీగల్ న్యాయం దానికి కరెస్పాండ్ కానప్పుడు సాంఘిక అశాంతి తప్పదు. ‘మాక్కావలసింది అదే, ఆ అశాంతే, అందుకే కదా ఈ పోలీసులు లాఠీలు, తూటాలు, సైన్యాలు, బోర్డర్ల పేరిట సైనిక పూజలు’ అంటారు పాలకులు.

ఇంతకూ ఇవన్నీ ఎందుకు? ఈ అశాంతిలో జనం నిమగ్నమై వుంటే తాము ‘శాంతి’గా జనాన్ని దోచుకుందామని కదూ?! ‘ఈ పిడికెడు మంది లాభాల యావ గాళ్లు మనల్ని ఎలాగూ శాంతిగా బతకనివ్వరు, ఒకటి గాకపోతే ఒకటి పోరాడాల్సిన సమస్యలు సృష్టిస్తూనే వుంటారు. మనకెట్టాగూ శాంతి లేదు అమీ తుమీ తేల్చుకుంటే సరి’ అని నూటికి ఎనభై మందిగా వున్న శాంతి ప్రేమిక ప్రజలు అనుకునే వరకే ఈ ఆటలు. ఇస్యూ వదిలేసి సాము చేసే సాము గరిడీలు.

“సాధు రేగిన తల పొలము దాక నిలువడు” అని తిక్కన. తలపొలము అంటే పొలిమేర.

ఉరేయ్, స్వాభావికంగా సాధు మనస్కులైన దేశ ప్రజ రేగితే మిమ్మల్ని ఈ వ్యవస్థ పొలిమేరలు దాటించి గాని వదలరు. మీకు నూకలు చెల్లినట్టే.

ఇవన్నీ మీ గోరీలకు మీరు మోస్తున్న ఇటుకలే.

25-04-2016

జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తదితరులపై యూనివర్సిటీ పాలక వర్గం శిక్షలు విధించింది. జేఎన్‌యూ క్యాంపస్ లో ఫిబ్రవరి 9 నాటి ఘటనతో సంబంధమున్న పలువురు విద్యార్థులపై చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం కన్హయ్య కుమార్ కు10 వేల రూపాయల జరిమానా విధించింది. ఉమర్ ఖలీద్ పై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడమేకాకుండా అతడికి 20 వేల రూపాయల జరిమానా విధించింది. అనిర్బన్ భట్టాచార్యను జూలై 15 వరకు సస్పెండ్ చేసింది. ఐదేళ్ల పాటు ఎటువంటి కోర్సులు చేయకుండా ఆంక్షలు విధించింది. అశుతోష్ కు 20 వేల రూపాయల జరిమానా విధించడంతోపాటు సంవత్సరం పాటు జేఎన్‌యూ హాస్టల్ లోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. ముజీబ్ గట్టోను రెండు సెమిస్టర్ల పాటు సస్పెండ్ చేసింది. ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ కూ రూ.10 వేలు జరిమానా విధించింది.
దీనిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఇది కాప్ పంచాయితీ తీర్పులాగా ఉందని ఓ విద్యార్థి వాఖ్యానించాడు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s