బియాండ్ మార్కెట్

  1. ఒకడు ఇతర్ల గురించి చెబుతాడు. నేను ఒకడి గురించి చెబుతాను. అతడొక పుస్తకం కావొచ్చు. నేనొక నయనం కావొచ్చు. ఇదింతే. ఇదొక విచిత్రమైన లోకం. అతడు ఇతర్ల గురించి చెప్పడు. నేను అతడి గురించి చెప్పను. వట్టి నటన. ఇదొక విచిత్రమైన అద్దం. అతడు ఇతర్లలోని తన గురించి చెబుతాడు. నేను అతడిలోని నా గురించి చెబుతాను. కర్త ఎవరో వారే కర్మ. ఎప్పుడూ అలాగే ముగుస్తుంది విలయం.
  1. నాకు సెక్సు వేస్తే ఏం చేస్తాను? ఎవరికో అభిముఖమవుతాను. నా లోనికి ఎవరినో పొదువుకుంటాను. నేను ఎవరి లోనికో పొదువుకుంటాను. నా కర్తను నేనే. నా కర్మనూ నేనే. నేను అనేది ఒక క్రియ లేని వాక్యం. వాక్యం లోని వంకరలకు చిత్రికలు పడుతుంటాను. దాన్ని నాకు తగినట్టు మార్చుకుని లోనికి పొదువుకోడానికి వాక్యం తనకు తానే ఒక శిశువూ, వుయ్యాల. తనలో తాను వూగుతుంటుంది,
  1. నాలాగే అతడు. అతడు కూడా ఒక నేనే. అహం బ్రహ్మస్మి. నేను కాకుండా ఇంకేదీ వుండదని కాదు. బ్రహ్మ కాకుండా ఇంకా చాల వుంటుందని చెబితే నువ్వు వింటావా, వినవుగా? నేను కాకుండా చాల వుందంటే నా వినయాన్ని చాల శ్లాఘిస్తావు గాని నీ నేను కాకుండా చాల వుందని…. అనబోతే చాలు నువ్వు సింహం మీంచి నా మీదికి లంఘించే దుర్గమ్మవి అయి పోవూ?
  1. అంతెందుకు, ఈ దారిలో ఇప్పుడొక ఏరు ప్రవహించి వెళ్లిపోయిందా లేదా? వెళ్లి పోయింది. కాని వెళ్లి పోలేదు. చూడు, ఏరు ఇక్కడే వుంది. ఈ ప్రవాహం కాకుండా ఇంకేమైనా వుంటే నాకు తెలీదు. నాకు తెలీనిదంతా లేదని అంటానా అని అడుగుతావు. ఔను, అంటాను, మరేమంటాను? ఏమైనా వుంటే చూపించు, నేను నుంచోడానికి కాసింత స్థలం? నిరంతరం విస్తరించే నేను నుంచోడానికి కా…. సింత స్థలం. హ్హి.
  1. సర్లే. నువ్వైనా ఏం చేస్తావు? నీకు కనిపించింది చూడగగలవు. నువ్వు చూసింది నాకు చెప్పగలవు. కావాలంటే బాగా వర్ణించగలవు. చూస్తున్నప్పడు నీకేమయ్యిందో కొంచెం నీ ముఖం చూపించగలదు. నువ్వు చూసిందాన్ని నాకు చూపించగలవా? నువ్వు రుచి చూసిందాని రుచిని ఒక చిటికెడు నాకు చూపగలవా? లేవు. నేను గలనా? లేను. లేనా? చూపగలననే కదా ఇంత కవిత్వం?
  1. ఇంకో దారి వుంది. డైలాగ్. మాటల మార్పిడి. అతడికీ నాకూ మధ్య. అతడికీ ఇతర్లకు మధ్య మార్పిడి. మార్పిడి అంటేనే మోసం. తూనికలు కొలతల్లో ఎచ్చు తగ్గులు. దానికే లాభం అని ఇంకో పేరుంది. నీకు వచ్చిందానికి ఇతర్లకు ఇచ్చిందానికి మధ్య డిఫరెన్సు. లాభం వుందనుకుంటే తప్ప నువ్వు రావు, నేనూ రాను, సంతకు. సంత కానిది ఏమైనా వుందంటావా? ఉండే వుంటుంది.
  1. సంత కాని దాని కోసం మనం వెళ్దామా? లేక అదే వస్తుందా? అది వచ్చే వరకు, మనమిక్కడే వుందామా?… సంతలో ఏదో ఒకటి బేరమాడుతూ…. మధ్య మధ్యలో కొట్ల నీడల్లో కాస్త కక్కుర్తి పడుతూ… నీడల్లేకుంటే చర్మం మీద ఓజోన్ రంధ్రం లోంచి ఎండ చేసే చిత్రాలకు సొక్కిపోతూ రాలిపోతూ…. అప్పడప్పుడు తీరే చిన్ని చిన్ని దప్పికలకి మురిసి పోతూ…ఇది మన సొంత నేషనల్ సంత కనుకనే చిటికెడు రక్తానికే గ్లాసెడు నీళ్లు దొరికాయని… దేశ మాతకు జై కొడుతూ, నిజం చాయ్ ఇచ్చినోడు నీ మీద కొంచెం ఒలికించాడని బూతులు తిడుతూ, దొంగ ఫోటోల్లోని చాయ్ వాలాలకు దణ్నాలు పెడుతూ… ….?  

19-03-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s