రాజీ పడడం హానికరం

ప్రతి చర్చ ఒక చర్య. మంచి చేసే చర్చను అర్థాంతరంగా వదిలెయ్యడం సరైన పని కాదు. మనం చెప్పిన మాటలు ఇతర్ల వ్యాఖ్యల వల్ల డిస్టార్ట్ అయ్యాయనుకుంటే, సంగతులను సవరదీసి మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పాలి. మానేయగూడదు. అవతలి వారు ఎంత విసిగించినా చర్చను ఆపేయకూడదు. ఆపేస్తే కాజ్ దెబ్బ తింటుంది. ఆ లెతర్జీ యథాతథ వాదానికి పట్టం కడుతుంది. మంచి మార్పు ఏదీ వుండదు.

1). పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీ… ఎవరో ఒక కరపత్రంలో దుర్గను అవమానించారంటూ మాట్లాడిన మాటలు… దేశంలో పౌరాణిక బహుళత్వాన్ని, సాంస్కృతిక బహుళత్వాన్ని అండర్మైన్ చేయడానికి వుద్దేశించినవి. స్మృతి ఇరానీ మాటల్ని సమర్థించడం ద్వారా రవి మొదలైన వారు భారత దేశంలో ‘పౌరాణిక బహుళత్వం’ మీదనే దెబ్బ కొడుతున్నారు.

2). ఈ చర్చలో సాంస్కృతిక బహుళత్వం గురించి చెప్పిన సురేష్ కొలిచాల వంటి వారు…. అచ్చంగా ఏం చెప్పదలిచారో నాకు అర్థం కాలేదు. ప్రస్తుత చర్చలో వారు చెప్పదలిచిందేమిటి? ఇందులో ఎవరు సాంస్కృతిక బహుళత్వాన్ని దెబ్బ తీస్తున్నారు? స్మృతి ఇరానీ దెబ్బ తీస్తున్నట్గయితే మన మౌనం ద్వారా, ఆమె మాటల్ని పేరు పెట్టి పరాస్తం చేయకపోవడం ద్వారా అలా దెబ్బ తీయంలో మనమూ భాగస్వాములం కావడం లేదా?

3). ఒక దళిత యువకుడు తన కులం దాచి అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకోడం, పెళ్లయ్యాక చూడ వచ్చిన ఆ యువకుని తల్లి భోజనాల దగ్గర సేమ్యా పాయసాన్ని మెచ్చుకుంటూ అచ్చు దూడ పేగుల్లా భలే వున్నాయని అనడం, దాని వల్ల ఆ యువకుని కులమేమిటో తెలిసిపోయి ఆ సంసారంలో ఘోరాలు సంభవించడం…. ఇది కథ. ఈ కథ కోసం కర్నాటక, తమిళ నాడు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను నా చిన్న నాడు కర్నూలు జిల్లా, నంద్యాల తాలూకాలోని మా చిన్న వూళ్లోనే విన్నాను. ఇంతకూ ఈ కథ ‘నీతి’ ఏమిటి, ఇది ఎవరి ప్రయోజనాల కోసం పుట్టింది? ఎవరి ప్రయోజనాల్ని నెరవేర్చగలుగుతుంది? దళితులు తమ కులం దాచి అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకుంటే ఘోరాలు జరిగిపోతాయని చెప్పడం కాకుండా ఇందులో ఏముంది? అలాంటప్పుడు ఆ అగ్ర వర్ణ స్త్రీ దళిత పురుషుడిని చంపడం దివ్య కార్యమని చెప్పడం కాకుండా ఇందులో ఏముంది?

4). అసందర్బం కాదు గనుక ఇలాంటిదే మరో కథ చెవుతా. శూద్రుడు తపస్సు చేస్తే ఘోరాలు జరుగుతాయని, ఒక బ్రాహ్మణ పిల్లవాని శవాన్ని చూపించి మరీ వాదించి, వశిష్టాది బ్రాహ్మణులు రాముడనే రాజుతో శంబుకుడిని చంపించిన రామాయణ కథ ఈ సందర్భంగా గుర్తుకు రావడం లేదా? అది గుర్తుకు వచ్చి నా వంటి శూద్రుడికి మండిపోయి ఆ రాముడిని, ఆతడి పురోహితులైన వశిష్టాది బ్రాహ్మలను నోరారా తిట్టేస్తే అది అన్యాయమా? అప్పుడు నేను ఒక వర్గం హిందువుల మనసు గాయపరిచానని మంత్రి స్మృతి ఇరానీ నిండోలగంలో సెంటిమెంటు పండిస్తారా? ఆ పంటకు రవి వంటి వారు మురిసి ముక్కలవుతారా?

5), రవీ… ఇక్కడ నా టైమ్లైన్ లో అయితే అంతా బహిరంగం, మీ గోడ మీద ఆంతరంగికత ఏదో వుంటుందంటూ తీసుకెళ్లి, మీరు చెప్పిన మహా గాథ ఆదే కదా. (దూడ పేగుల బదులు, మీ కథలో ఎద్దు నాలుక వుంది. అట్టాంటి ఇంకొన్ని తేడాలున్నాయేమో. ఒక వూరికి ఇంకో వూరికి ఆ మాత్రం తేడాలుంటాయి జానపద గాథల్లో. రెండూ ఒక కథే). ఇంతకూ మీరు ఆ కథను ఇక్కడ ఎందుకు చెప్పినట్టు? దీనికీ స్మృతి ఇరానీ అనే మంత్రి పార్లమెంటులో దుర్గ ను సెక్స్ వర్కర్ అన్నారంటూ ఒలికించిన సెంటమెంటుకూ ఏమిటి సంబంధం?

4. మహిషాసురుడు మూలవాసుల రాజు. దురాక్రమణ దారులు ఆయన్ని నేరుగా ఓడించలేక ఒక స్త్రీ ద్వారా మోసగించి ఓడించారని ఒక కథ వుంది. ఆ కథ చెప్పుకునే వారికి దుర్గ దేవత కాదు, మహిషుడే దేవత. మైసయ్య, మైసమ్మ, మైసూరయ్య, మైసూరు అనే ఊరి పేరు దాన్నించి వచ్చినవే. రవి తదితరులు ప్రాతినిధ్యం వహించే దుర్గ తరుఫు వారు మహిషాసురుడు రాక్షసుడనీ, దర్మార్గుడనీ; దేవి దుర్గ సింహం మీద వచ్చి అతడిని చంపిందని ఒక మహా గాథ (మెటా న్యారేటివ్)ను సృష్టించారు. ఇది మూల వాసులను అవమానించే గాథ. అవమానపడం, బాధపడడం… రవి చెప్పే ఒక వర్గం హిందువులకే కాదు… మూలవాసులకు, శూద్రులకు కూడా వుంటాయి. మూలవాసులు,, శూద్రుల బాధను కూడా బాధ అనే అనాలి. వాళ్లది కూడా బాధ అయినట్టయితే, వాళ్ల నాయకుడిని మోసగించి చంపిన స్త్రీని సెక్స్ వర్కర్ అని వాళ్లు అనడంలో ఏమంత అమానుషం కనిపించింది ఆ మంత్రి గారికీ, మీకు? మీ మెటా న్యారేటివ్ ని అంగీకరించకుండా ఎదురు తిరిగి వాళ్ల చిన్న న్యారేటివ్ ను వాళ్లు తయారు చేసుకున్నారని ఏడుపు కాకుండా ‘మీ’ వాదంలో పస ఏముంది?

చివరగా మిత్రులందరికి ఒక మాట. ఇలాంటి అసత్యాలు, అర్థ సత్యాల మీద బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే. దక్షిణాన వేమన, త్రిపిర్నేని రామస్వామి చౌదరి, రామస్వామి నాయకర్ వంటి వారు గొప్ప పోరాటాలు చేశారు. ఇటీవల రంగనాయకమ్మ రామాయణ విష వృక్షం వంటి పుస్తకాలు ఆ ఫోరు బాట లోనివే. ఆయా పోరాటాలలో లోపాలు/దోషాలు ఏమైనా వుంటే వాటిని సరిద్దుకుంటూ ఆ పోరాటాన్ని కొనసాగించాలి. లేకపోతే అబ్స్కురాంటిజమ్…. కుల, మత వాదం ….మళ్లొక్కసారి దేశాన్ని, తెలుగు వాళ్లను ముంచెత్తుతాయని గట్టిగా భావిస్తున్నాను. మనం ఏ కులంలో, ఏ మతంలో పుట్టామనేది… యాక్సడెంటల్ కనుక., దాన్ని పక్కన పెట్టి నేటి తల కిందుల వాస్తవికతను దాని కాళ్ల మీద నిలబెట్టే పని చేయాలి. ఇందులో ఇస్యూలే కాని వ్యక్తులు ముఖ్యం కాదు.

27-20-2016

Leave a comment