ఒక స్నేహ లేఖ

(మిత్రుడుRavi Env నా మునుపటి పోస్టుకు పెట్టిన కామెంటుకు కొంచెం వివరంగా జవాబివ్వాలని ఈ ప్రయత్నం).

రవీ! నా పఠన కౌశల్యాన్ని పెంచడానికి మీరు తీసుకున్న శ్రద్ధకు కృతజ్జ్ఞతలు. నేను తప్పుగా చదివానంటున్న మీ పోస్టు కాపీ/పేస్టు:

“వుమన్ ఎన్ పవర్మెంట్ – అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది స్మృతి. మరీ ఈ రేంజులో నాక్కూడా అర్థమయ్యేలాగా చెప్తావనుకోలేదమ్మా. నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినోళ్ళు ఇట్ల చెప్పింటే ఇప్పుడు ఎలా ఉండేవాణ్ణో. థూ, జీవితం.”

ఆ మాటలురాహుల్ గాంధీ అన్నట్టు మీ వ్యంగ్యం, కింద రాహుల్ తల పట్టుకున్న బొమ్మ వుంది కాబట్టి.

నాకయితే ఆ మాటలు మీవి కూడా, అది మీ బాధ కూడా అని గట్టిగానే అనిపించింది. దానికి కారణం అంతకు ముందు పోస్టులలో మీరు స్పష్టంగా మీవి గానే చెప్పిన మాటలు. ఆ మాటల్ని కూడా మీ టైమ్లైన్ నుంచి కాపీ/పేస్టు చేస్తానిక్కడ, మన మిత్రుల సౌలభ్యం కోసం (మీరు నా మిత్రుడనే అనుకుంటున్నాను ఇప్పటికీ, వీలయితే ఎప్పటికీ).

‘స్మృతి ఇరానీ, మీ బా(మా)టే మాది. సెక్యులరిజం, వాక్ స్వాతంత్రాల పేరు మీద ఎవరేది మాట్లాడినా, ఎంత నీచంగా ప్రవర్తించినా విశాల హృదయంతో వాటిని మన్నించే అవసరం మాకు లేదు. ఏ ముద్ర వేసినా సరే. ఎవరేమనుకున్నా మా దేశభక్తి మాది.’

రవీ! ఆమె బాటే మీ బాట. అంతవరకు ఓకే. దాన్ని కాదంటే ‘నీచం’? ఏమి సంస్కారం మిత్రమా! ఇట్టాంటి మీరు ఆమె క్లాసులు వినుంటే ఇప్పటికి చాల పైన వుండే వారు కదా?! ఆ సౌలభ్యం రాజీవ్ కే ఎందుకు పరిమితం చేయాలి?!

ఈ మాటలు అనడానికి ముందు మీరు ఇంకోటీ అన్నారు:

‘ఓ రెండు యూనివర్సిటీ ప్రాంగణాలలో, తప్పిదాల్లేకపోయినా ప్రభుత్వం మీదా, సైన్యం మీదా బోల్డంత విద్వేషాన్నీ, వితండ వాదాలనూ తీసుకొచ్చి చాలా విశాల హృదయం అలవర్చుకొమ్మని ఘోషించిన మేతావులు, ఒక వర్గం దేవతగా కొలిచే ఒక ఐకన్ మీద ఛండాలమైన రాతలను పసిపిల్లల హృదయాల్లో నూరిపోస్తున్న దుష్టశక్తుల గురించి ఏమంటారో?’

యూనిర్సిటీ ప్రాంగణాల్లో ప్రభుత్వం తప్పిదాలు లేవనేది మీ సర్టిఫికెట్.

అందాక వెళ్లాక ఇక మీకూ అబద్దాల ఇరానీకీ తేడా ఏమిటి?

మీరు చెప్పే ఆ ‘ఒక వర్గం ఐకన్’ ఎవరు రవీ! స్మృతి ఇరానీ కాదు లెండి, ఆ మాత్రం రీడింగ్ స్కిల్స్ వున్నాయి నాకు. దుర్గ అనే దేవత కదూ?! ఏం, ఆ దుర్గ ఒక దురాక్రమణ దారుగా మహిషాసురుడు అనే ఒక మూలవాసిని చంపిందని మూలవాసుల మీద ప్రేమ వున్న వాళ్లు అనగూడదా?

దానికి మీ సెన్సార్షిప్, ఆ మంత్రిణి సెన్సార్షిప్ ఏమిటండీ?

దాన్ని కాదంటే ‘మేతావుల’నీ, తిట్టుగా ‘ఛండాలమ’ని, ‘నీచ’మనీ, ‘దుష్టశక్సుల’నీ…. ఆ దూకుడేమిటి? మీకేనా ఐకన్లు మూల వాసులకు వుండకూడదా? మీకేనా పురాణాలు, వాళ్లకు వాళ్ల పురాణాలు వుండగూడదా?

కాస్త ఆలోచించండి. దీన్ని మరొక విన్నపంగానే భావించండి.

26-02-2016

Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in సంవాదాలు వివాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s