ఇది మన ప్రపంచం కాదు

ఇలాగే, ఈ బురద నేలల్లోనే, ఈడ్చుకుంటూ పద పద
ఇలాగే, ఈ మొహాన ఇసుక కొట్టే గాలి వానలోనే పద
పదే పదే అరిచే పేగులకు ఆకలిని నైవేద్యం పెడుతూ
పడి పడి నడవాల్సిందే, మనమిక్కడ వుండ గూడదు
ఇది హంతకులు పటాలెక్కి పూజలందుకునే స్థలం
ఇది వంచకులు పలు విధాలుగా కీర్తించబడే కావ్యం
భయపడకు, ఏ వంకర కర్ర దొరికితే దాన్ని పట్టుకో
ఏ చివికిన కంకి దొరికినా పరిగ ఏరుకుని వండుకో
పద ముందుకు ఆగితే రాలి పోతాం పూయని పువ్వులమై
చీకటి పొదల్లోంచి బుస కొట్టే నాగులు
దారికి అడ్డంగా కళ్లెలు కొట్టే వాగులు
అందమైన ఆడపిల్లల వేషంలో మురిపించే మాంసాహారప్పువ్వులు
ఎవరితో ఏమని వాదిస్తావు, ఎవరిని ఏమని జవాబుదారీ చేస్తావు
నీకు నువ్వే కాపలా నీకు నువ్వే అసరా ఓర్నాయినా నడవాలి నీ
కోసం నువ్వే పద పద ఇక్కడ ఆగకు ఇది నర రక్తం రుచి మరిగిన
అమాయికమైన శాంతి కాముకమైన నరకం
అయినా భయం గియం విడు పద పద నడు
వాళ్లు వాళ్ల దాహానికి మన కన్నీళ్లు తాగుతారు
టిస్యూ పేపరుగా మడిచి మన బతుకుల్ని వాడుతారు
నిండు బొజ్జలు నిమురుకుంటూ తర్క వీథుల్లో విహరిస్తారు.
నువ్వు ఎన్నైనా చెప్పు వాళ్లు ఇంకోటడిగే అప్రస్తుత పృచ్చకులు
వెనుదీయకు, మాట్లాడు, కాని ఇక్కడ ఆగకు, ముందుకు నడు

28-02-2016

 
 
 
Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s