వేళయ్యింది పూజకా, ఉచ్చాటనకా???

దేవుడు, దయ్యం మనల్ని వదలవు. వాటితో నాకు పని లేదన్న వాళ్లని కూడా వదలవు. అవి వద్దనే వాళ్లు ఐసొలేటెడ్ గా బతకలేరు కదా?! చాల ఎక్కువ మంది అదే ధ్యాసలో వున్నప్పుడు మన నడకలో పది అడుగుల కొకసారైనా ఈ దయ్యం/దైవం కాళ్లకు అడ్డు పడుతూనే వుంటుంది. దీన్ని చేతిలోకి తీసుకుని పక్కకు విసిరేసి ముందుకు పోవడంలో చిన్న పాటి ఛాలెంజి కూడా ఉంటుంది. తాత్విక సవాళ్లు బాగుంటాయి, పర్సనల్ అబ్యూజ్ కి దిగనంత వరకు.

ఇట్టా దేవుడు దయ్యం అని ఒకే బ్రెత్ లో మాట్లాడితే కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఏం చేయను?! దేవుళ్లలో చెడ్డ చేసిన వాళ్లున్నారు. దయ్యాలలో మంచి చేసేవి వున్నాయి.

(దేవుడు మహద్వాచకం, దయ్యం మహతీ లేదా అమహద్వాచకం కావడంలో కుట్ర ఏమీ లేదంటారా?)

అందరి కష్టం కొందరు మోసగించి తినడం నేరమైతే మొదటి నేరగాళ్లు దేవుళ్లేనని మంథర గిరి సాక్ష్యం చెప్పదా? అందరు కలిసి సంపాదించిన అమృతం తాము మాత్రమే దొబ్బి తాగిన వాళ్లని, ఆ పని కోసం ఒకరు ఆడ వేషం వేసి చేసిన మోసాన్ని …. తెలిసీ పూజిస్తామెందుకో… మనం మోసగించబడిన వాళ్ల పిల్లలమని తెలిసీ?!

దేవుళ్లలో చెడుగు వుంది. దయ్యాల్లో మంచి దయ్యాలున్నాయని ఎన్ని చందమామ కథలు చదువుకోలేదూ?!

అయినా భాషలో దైవం దయ్యం మరీ ఇంత దగ్గరగా ఎందుకున్నట్టూ? దైవం ప్రకృతి, దయ్యం వికృతి అంటారు. అసలు ఒకప్పుడు అవి రెండు పదాలు కాదు. ఒకే పదం. దేవుళ్లలో మాలిగ్నెంట్ దేవుళ్లుండడం దయ్యాల్లో బెనెవలెంట్ దయ్యాలుండడం దానికి సాక్ష్యం.

దాన్ని భయం అంటారా, రహస్యం అంటారా మీ ఇష్టం… ఎప్పటికీ విడని రహస్యం భయంకరం కాదూ… భయమే మూలం అనడం తప్పు కాదనుకుంటా.

తన భయానికి, తన దిక్కుదోచని తనానికి, జీవితానంతరం ఏంటబ్బా అనే పజిల్కు చెప్పుకున్న ఆల్జీబ్రా ఎక్స్ తరహా సమాధానం దైవం/దయ్యం. ఒకప్పుడది ఒకే పదం
తాము ఏమి మాట్లాడుతామో అదే సహజమని, అదే ప్రకృతి అని….’శిష్టుల’ నిర్వచనం. అంతే గాని దైవం ప్రకృతి కాదు. అది సంస్కృతి (ప్రకృతి నుంచి తీసుకుని సంస్కరించబడినది). దయ్యమే ప్రకృతి. అది మనిషికి న్యాచురల్.

ఈ తలకిందుల యవ్వారం ఎప్పటి నుంచో నడుస్తోంది, నైతిక తాత్వక చర్చలో.

మార్క్స్ ఏమన్నాడు. తలకిందుల ప్రపంచాన్ని దాని కాళ్ల మీద నిలబెడదామన్నా డు.

అన్నిటి లాగే దీన్నీ దాని కాళ్ల మీద దాన్ని నిలబెట్టి చూద్దాం. ఇప్పుడెలా వుంది దయ్యం/.దైవం? దీన్నిపూజించాలనిపిస్తోందా లేక ఉచ్ఛాటన చెయ్యాలనిపిస్తోందా? 

21-02-2016

 
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s