సిగ్గు

కొంచెం తోసి చూస్తావు

గోడ కూలిపోదు

దారిన పోయే వాళ్లు నీ వైపు చూస్తారు

సిగ్గుపడి నవ్వుతావు

గోడవతల ఏముంది అని

వాళ్ల కనులలో దాగని ప్రశ్న

వైశాల్యం అంటావు  నువ్వు

వాళ్లకు వినబడదు

వినబడినా ఏం తెలుస్తుంది

ఇరుకు అయితేనేం అనుకునే వాళ్లకు

వాళ్లు వైశాల్యాన్ని స్వప్నించరు

తినడం సెక్సడం నిద్రపోవడం

అరవడం కరవడం

ఇరుకులో ఊపిరాడక ఎవరేనా ఒరిగితే

కాసేపు ఏడ్చి

ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి బువ్వ తింటే

ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని

కాస్త సందేహించడమే

గొప్ప సున్నితత్వం అనుకోవడం, అంతే వాళ్లు

వాళ్ల లోంచీ

ఎప్పుడైనా ఒకరు వస్తారు ఒకరు లేదా ఇంకొకరు

నీ లాగే కలలు గని వుంటారు

లోకాన్ని విశాలం చేద్దామని

గోడల్ని తీసేసి

గొడవల్ని తీసేసి

అక్కడక్కడ మొక్కలు నాటి

చెట్లు పెంచి

చెట్ల కింద అరుగులు కట్టి

అరుగుల మీద చిన్ని దోనెలు తొలిచి

వాటిలో నీళ్లు పోసి పిచికలు

వస్తాయని చూస్తూ కూర్చుంటారు

ఊర్నే అలా దారిని పోరు

పోతూ పోతూ

నిన్ను సిగ్గు పడేలా చూడరు 

7-12-2015 

Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

One Response to సిగ్గు

  1. Indus Martin says:

    HRK , loved reading every line. Your mystic imagery plays a haunting influence on my mind day and night. It’s a great learning reading your poetry !

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s