లవ్యూ లవ్యూ ఆల్

(For Your Eyes Only

I know, it is a nothing

Actually, I love the nothing

Definitely not a poem)

నిండు సభ యిది

నిజముగనే

ఎవరూ లేరు

చారిత్రకమో

పౌరాణికమో

‘విధి’ విధీకృత

విధేయతల కావల

లేరు గురూ! లేరెవరు

కురు క్షేత్రాంతరమున

ఎవరూ లేరు, రెండు

రణ శ్రేణుల మధ్యమున

నొక ‘నో మ్యాన్స్ ల్యాండ్’

లేదు, లేనే లే దెప్పటికీ

నీకూ నాకూ చెందని నేల

కనుక, కోశాంబీ గారన్నట్లు

లేదు భగవద్గీత, అదిన్నీ

లేనప్పుడిక యేల

మందుకొట్టిన

‘సురా’ధిపతి

అందువలన నో యిందు వదన

నన్ను వుండనిమ్ము

ఒక యసురుడుగానే నే

నుడివెద నీకు నాకుఁ దప్ప

మరి ఎవరికిన్నీ దెలియని

యొక యద్భుత లిపిలో

ఒకానొక స్వప్నానంతరమైన,

ఎండకు చీలిన, నిర్జల సీమలో

ఇప్పుడునికిని కోల్పోయిన

నా ప్రేయసి రాయలసీమలో

ఇదిగో అమ్మాయీ! ఇచట నిచటనే

నేనోడితినొక, కడుంగడు ప్రాత

కుసుమమై వాడితిని

రాలితినిట యిక వికసించ

గలనో లేదో

సెలవు సెలవు

సెలవని

మరియున్నూ

నా సగం అంగీ!

జయ జయ జయ

జయ జయ జయహే యని

జయమ్మా ఐ లవ్యూ

మమ్మితల్లీ ఐ లవ్యూ

అన్య పాపా

నా నిక్కపు నేస్తమా!

నీకూ తెలుస్తుందిలే

ప్రేమ గెలుస్తుందని

ఐ లవ్యూ లవ్యూ లవ్ యూ

29-7-2015 ……………. 3-8-2015

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s